Actor Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు.

చంద్రబాబు మీద ఆర్జీవి సినిమా వోడ్కాకు పనికొస్తుంది…
ఇక ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ పృథ్వీ ఈ సారి జగన్ ను ప్రజలు నమ్మరు అంటూ చెప్పాడు. చంద్రబాబు మీద ఆర్జీవితో జగన్ సినిమా తీయిస్తున్నారు అనే అంశం మీద మాట్లాడుతూ జనాలు అలా ఉద్దేశ పూర్వకంగా సినిమాలను తీస్తే చూసి వాటి వల్ల ప్రభావితం అవుతారని అనుకోను అంటూ అభిప్రాయపడ్డారు.

ఈ మధ్య జనాలు కూడా సినిమాలను చూసే తీరు మారిపోయింది. ఆర్జీవి తీసే సినిమా వల్ల డైరెక్టర్ కి, నిర్మాతకి మాత్రమే లాభం. ఎందుకంటే సినిమా తీయడానికి ప్రభుత్వం డబ్బులిస్తుంది కాబట్టి ఆ డబ్బుతో ఇంకొంచెం ఎక్కువ వోడ్కా తాగడం తప్ప ఏమీ కాదు. ఆ సినిమాతోనే కుప్పంలో చంద్రబాబు ను ఓడించేస్తాం అనడం హాస్యాస్పదం అంటూ చెప్పారు.


































