Rajashekhar-Cash Show: రాజశేఖర్.. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఒకానొక సమయంలో అగ్రహీరోలకు తీసిపోని విధంగా సినిమా హిట్లు కొట్టారు. ముఖ్యంగా పోలీస్ క్యారెక్టర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేపేరు రాజశేఖర్ అంతలా పోలీస్ క్యారెక్టర్లలో పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తి.

రాజశేఖర్ వేసిన పోలీస్ క్యారెక్టర్లు చూసే కొంత మంది హీరోలు తమ తర్వాతి సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు చేశారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల హిట్లు లేకపోవడంతో రాజశేఖర్ చాలా స్లో అయ్యారు. ముఖ్యంగా కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో కెరీర్ సాఫీగా సాగలేదు.

ఎదైనా స్ట్రెయిట్ పార్వర్డ్ గా మాట్లాడటం చాలా మందికి నచ్చలేదు. అయినా కూడా తన పంథాను మార్చుకోలేదు రాజశేఖర్. తను మాట్లాడాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా చెప్పడం రాజశేఖర్ స్టైల్. తాజాగా ఆయన క్యాష్ షోకు వచ్చారు.
తన ఇద్దరు కూతుళ్లతో షోకు ఎంట్రీ..
సంక్రాంతి రోజు ప్రసారమయ్యే ఈ షో ప్రోమోను రిలీజ్ చేశారు. జీవితతో పాటు తన ఇద్దరు కూతుళ్లతో షోకు ఎంట్రీ ఇచ్చాడు. బుల్లెట్ బండిపై రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివానిలతో క్యాష్ ప్రోగ్రామ్‌లో సందడి చేశారు రాజశేఖర్. ఇదిలా ఉంటే ప్రోగ్రాం చివర్లో రాజశేఖర్ వేసిన పంచ్ షో కే హైలెట్ గా నిలిచింది. సాధారణంగా రాజశేఖర్ మాట్లాడేటప్పుడు జీవిత అందిస్తుంటుంది. రాజశేఖర్ గారూ మా క్యాష్ ప్రోగ్రామ్ ఎలా ఉంది?’ అని సుమ అడగడంతో.. ‘సూపర్బ్ ఉంది.. కానీ’.. అంటూ గ్యాప్ ఇచ్చారు.. ఆ గ్యాప్‌ని జీవిత ఫిల్ చేస్తారు అనుకుంటే.. హా అంతే అంటూ ముక్తాయింపు ఇచ్చేశారు.. దీంతో ఆయన స్టేజ్‌పై నవ్వులు వెల్లివిరిశాయి. ప్రస్తుతం రాజశేఖర్ ‘ శేఖర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమాను రిమేక్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా సినిమా రాబోతోంది.

































