Actor Rangasthalam Mahesh : సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడి ఒకవైపు జబర్దస్త్ చేస్తూ మరోవైపు సినిమాల్లో చిన చిన్న పాత్రలను చేస్తూ రంగస్థలం, మహానటి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మహేష్. జబర్దస్త్ మహేష్ కాస్తా రంగస్థలం మహేష్ గా గుర్తింపు తెచ్చుకుని అందరు స్టార్ హీరోల సరసన నటించి కెరీర్ లో ముందుకు పోతున్న రంగస్థలం మహేష్ ఇటీవలే వీరూపాక్ష సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించారు. ఇక తాను ఎదుర్కొన్న కష్టాలను చేదు అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

జబర్దస్త్ పేమెంట్స్ ఎలా ఉంటాయంటే…
జబర్దస్త్ లో మొదటగా మహేష్ కు అవకాశం ఇచ్చింది శకలక శంకర్. ఆయన టీంలో చేసిన మహేష్ చాలా మందికి జబర్దస్త్ ద్వారా సుపరిచితుడు అయ్యాడు. ఆ షోలో చేస్తూనే సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలుగు షోలలో అప్పుడప్పడు కనిపిస్తూ ఉండే మహేష్ ఆ షోలలో పేమెంట్స్ గురించి మాట్లాడుతూ కంటెస్టెంట్ గా ఉన్నపుడు పేమెంట్స్ అప్పటి నా పొజిషన్ కి చాలా ఎక్కువ అంటూ చెప్పారు. ఇక గెస్ట్ గా వెళ్ళినపుడు కూడా మంచి పేమెంట్ ఇచ్చారు. ఢీ షోల గురించి నాకు తెలియదు. కానీ జబర్దస్త్ లో మంచిగానే చూసుకున్నారు అంటూ తెలిపారు.

ఇక శ్రీ దేవి డ్రామా కంపనీ లో ఒకేసారి గెస్ట్ గా వెళ్ళినపుడు డాన్స్ చేసినపుడు చైతన్య మాస్టర్ పరిచయం అంటూ తెలిపారు. డాన్స్ నేర్పించారు చాలా టాలెంటెడ్, ఆయన మరణించాడని తెలిసీ చాలా బాధగా అనిపించింది. అంత టాలెంటెడ్ అలాగే తనతో మాట్లాడితే మంచి మోటివేషన్ అనిపిస్తుంది. అలాంటి మనిషే చనిపోతే ఇంకా చిన్న చిన్న పొజిషన్స్ లో ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూసేవారు భయపడతారు. ఆయన ఆత్మహత్య చేసుకోకుండా కాసేపు ఆలోచించాల్సింది. ఈరోజు కాకపోతే మరో రోజు తన జీవితం మారేదేమో, తప్పు చేసారు అంటూ మహేష్ అభిప్రాయపడ్డారు.

































