Sammeta Gandhi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాక్టర్ సమ్మెట గాంధీ ఒకరు. ఈయన రాజన్న వకీల్ సాబ్ అఖండ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. రాజన్న సినిమాలో ఆయన నటన చూసి తనని వకీల్ సాబ్ సినిమా కోసం ఫోన్ చేసి మరి పిలిపించి వేషం ఇచ్చారని ఈ సందర్భంగా సమ్మెట గాంధీ వెల్లడించారు. తనకు పవన్ కళ్యాణ్ తో నటించాలని ఎప్పటినుంచో కల. ఆ కల ఈ సినిమా రూపంలో నెరవేరిందని సమ్మెట గాంధీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి మందు తీసుకురావడం కోసం సగం రోజు మొత్తం తిప్పించి షూట్ చేశారు.. సినిమాలో మాత్రం ఆ సీన్ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఇకపోతే అఖండ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమ్మెట గాంధీ ఈ సినిమా గురించి, బాలకృష్ణ గారి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సినిమా అనుకున్న సమయంలో బోయపాటి స్వయంగా నాకు ఫోన్ చేసి ఇలా మీకోసం ఒక పాత్ర ఉంది గాంధీ గారు తప్పకుండా మీరే చేయాలి అని అడిగారు. 2020 మార్చి నెలలో సినిమా ముహూర్తం ఫిక్స్ చేసి నాకు చెప్పారు.

సాధారణంగా సినిమా స్టార్ట్ చేసే ముందు హీరోలు నిర్మాతలతో స్టార్ట్ చేస్తారు. కానీ బోయపాటి శ్రీను మాత్రం కొబ్బరికాయ నా చేతి కిచ్చి ఒక డైలాగ్ చెప్పి కొబ్బరికాయ కొట్టమన్నారు.అలా కొబ్బరికాయ కొట్టే సమయంలో ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుని కొబ్బరికాయ కొట్టాను అంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే చాలామంది బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ అని చెబుతుంటారు .మరి బాలకృష్ణ గారితో నటించడం మీకు ఎలా ఉందని ప్రశ్నించగా ఈయన బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
కల్మషం లేని వ్యక్తి బాలకృష్ణ…
నేను అఖండ సినిమా సెట్ లో ఉన్నప్పుడు నాకు కూడా చాలామంది బాలకృష్ణ గారితో మాట్లాడకండి ఆయనకు కోపం ఎక్కువ ఆయనకు నమస్కారం పెట్టిన కోప్పడతారు అంటూ చాలా చెప్పారు.అయితే బాలకృష్ణ గారు రాగానే వెళ్లి నమస్కారం సార్ అని రెండు చేతులతో నమస్కారం పెట్టాను. అందుకు బాలకృష్ణ నమస్కారం అని నవ్వుతూ ఎంతో చక్కగా మాట్లాడారు. అందరూ అనుకునే విధంగా బాలకృష్ణ వ్యక్తిత్వం అది కాదు ఆయన ఎలాంటి కల్మషం లేని మనిషి.మంచి మనసున్న మనస్తత్వం బాలకృష్ణది అంటూ ఈ సందర్భంగా సమ్మెట గాంధీ బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి తెలియజేశారు.































