Actor Satya Dev: వర్సలైట్ యాక్టింగ్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు సత్యదేవ్ ఒకరు. ఈయన హీరోగా నటిస్తూనే మరోవైపు కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో సందడి చేశారు.ఈ సినిమా అనంతరం నటి తమన్నాతో కలిసి గుర్తుందా సీతాకాలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఎప్పుడు తన ఫ్యామిలీని పరిచయం చేయలేదు.
అందరూ సెలబ్రిటీల మాదిరిగా కాకుండా సత్యదేవ తన ఫ్యామిలీని సోషల్ మీడియాకు కూడా దూరంగా పెట్టారు. అయితే తన భార్యను ఈయన గుర్తుందా శీతాకాలం సినిమా ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈమె తెరపై కనిపించకపోయిన తెర వెనక ఉండి తన భర్తను చాలా అందంగా చూపించడం కోసం కష్టపడుతున్నారని చెప్పాలి.

Actor Satya Dev: కుమారుడు పుట్టినరోజు సందర్భంగా…
ఈమె సత్యదేవ్ చేసే సినిమాలకు స్టైలిష్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా సత్యదేవ్ తన భార్య దీపిక తన కుమారుడు సవర్నిక్ లతో కలిసి దిగినటువంటి ఫోటోలను షేర్ చేశారు. అయితే తన కుమారుడు రెండు సంవత్సరాలను పూర్తిచేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈయన తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో వైరల్ గా మారడంతో సత్యదేవ్ కుమారుడు చూడటానికి చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది.


































