Actor Shiva krishna : డైరెక్టర్ తేజ తిక్కలోడు…తేజ లొకేషన్ లో కొడతాడని చాలా మంది చెప్పారు….అవన్నీ నిజమే…: సీనియర్ నటుడు శివకృష్ణ

0
18

Actor Shiva Krishna : రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఆయన వద్ద సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి రాత్, గులాం తదితర హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి అవార్డ్స్ కూడా అందుకున్నారు. తరువాత సినిమా డైరెక్టర్ అయిన తేజ చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆయన సినిమాల్లో హీరోల దగ్గరి నుండి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరిని ఆడిషన్ చేసి ఆయనే స్వయంగా ఎంపిక చేస్తారు. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే మరోవైపు ఆయన సెట్స్ లో ఆయన చెప్పినట్టు నటించకపోతే కొట్టేస్తారు అంటూ పుకార్లు బయట ఉండగా వాటి గురించి నటుడు శివ కృష్ణ గారు క్లారిటీ ఇచ్చారు.

తేజ నిజంగానే కొడతాడు…

విప్లవ సినిమాల్లో ఎక్కువగా నటించిన శివ కృష్ణ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తున్నారు. తేజ డైరెక్షన్ లో జయం సినిమాలో హీరోయిన్ సదా కి తండ్రిగా నటించారు. తేజ డైరెక్షన్ గురించి సెట్స్ లో ఆయన బేహేవియర్ గురించి ఆయన మాటాడుతూ మొదట్లో ఇవన్నీ చెప్పి నన్ను అందరూ టెన్షన్ పెట్టారు. అయితే తేజ నిజంగానే సెట్స్ లో కొట్టాడట. అయితే అది కోపంతో వారిని కొట్టలేదు.

అంతమంది జూనియర్ ఆర్టిస్టులను మెయింటైన్ చేయాల్సిన సమయంలో కొన్నిసార్లు విసుగు రావడం జరుగుతాయి. అందులోనూ తేజ వ్యక్తిత్వం కాస్త దుందుడుకుగా ఉంటుంది అందుకే అలా అంతే కానీ తేజ చాలా మంచి డైరెక్టర్ అంటూ చెప్పారు. తనకు మన పని నచ్చితే ఒక్క మాట మాట్లాడరు. సెట్స్ లో ఒకరోజు డైలాగు ఎలా చెప్పాలో ఆయనకు ఏం కావాలో చెప్తారు నచ్చాక ఇక అసలు మాట్లాడరు అంటూ చెప్పారు.