Actor Shivaji Raja : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడుగా, హాస్య నటుడుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు శివాజీ రాజా. 1985 లో తెలుగు చలన చిత్రాలలో తన కెరీర్ ని మొదలు పెట్టిన శివాజీ రాజా ఇప్పటివరకూ దాదాపు 260 చిత్రాలలో నటించాడు. ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన ‘కళ్ళు’ అనే సినిమాలో మంచి నటనతో అవార్డులతో పాటు గుర్తింపు తెచ్చుకున్నాడు. వెండితెర మీదనే కాకుండా బుల్లితెర మీద ప్రసారం అయిన ‘అమృతం’ సీరియల్ లో కూడా కొన్ని ఎపిసోడలలో నటించి నవ్వించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ రాజా తనకు శ్రీకాంత్, బండ్ల గణేష్ కి మధ్య ఉన్న స్నేహం ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చారు.

బండ్ల గణేష్ అలా చేస్తాడు అని అనుకోలేదు…
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు నేను, శ్రీకాంత్, బండ్ల ముగ్గురం ఒక బ్యాచ్ అని చెప్పుకొచ్చారు. బండ్ల ఇప్పటికీ నన్ను శ్రీకాంత్ ని అన్నయ్య అనే పిలుస్తారు అని చెప్పారు. బండ్ల గణేష్ ఇపుడు ఎలా ఉన్నాడో అప్పుడు కూడా అలానే ఉండే వాడని, నేను శ్రీకాంత్ బయటకి వెళ్తే శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇద్దరూ మందు కొట్టడానికి బయటకు వెళ్లారు అని చెప్పేవాడని చెప్పారు. దాని గుర్తుపెట్టుకొని మరుసటి రోజు షూట్లో కర్ర తీసుకొని కొట్టే సమయంలో నిజంగానే కొట్టేవాడినని తాను సెట్ అంతా పరుగులు పెట్టేవాడిని అని చెప్పారు.

ఇక ఈ మధ్య బండ్ల ఒక అమ్మాయి ఫోటో చూపించి నేను ఈ అమ్మాయిని పెంచుకుంటున్నాని అని చెప్పాడు. చాలా మంచిపని చేస్తున్నావు అని చెప్పాను. నిజంగా బండ్ల గురించి మొదటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి వీడితో అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇపుడు చేసిన పనికి ఆ అభిప్రాయం పోయింది. ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఒక రోజు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తావ్ పెద్దనాన్న అని అడిగింది, పక్కన వాడు చెప్తున్నాడు పాపకి పెద్దనాన్న అని పిలువు అని చాలా సంతోషం వేసింది అని చెప్పుకొచ్చారు.































