ఒకప్పుడు కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించిన సుధాకర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే అతడు హీరోగా కూడా కొన్ని సినిమాలను చేశారు. దక్షిణాది భాషల్లో సుమారు 600 కిపైగా సినిమాల్లో నటించిన సుధాకర్ తమిళంలో హీరోగా చాలా సనిమాల్లో నటించారు. అయితే హీరోయిన్ రాధికతో అతడు 18 సనిమాల్లో నటించారు.

ఒక హీరో, హీరోయిన్ చేసిన సనిమా హిట్ అయిదంటే.. అదే జంటతో మరొక సినిమా చేయడానికి క్యూ కడతారు దర్శక నిర్మాతలు. దీంతో వారిద్దరి మధ్య గాసిప్ లు, రూమర్లు, ప్రేమ ఉందంటూ సోషల్ మీడియాలో ఫేక్ చక్కర్లు కొడుతుంటాయి. అలాంటిది సుధాకర్, రాధిక ఏకంగా 18 సినిమాల్లో నటించారంటే.. ఇక ఏ రేంజిలో వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందని అనుకొని ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు సుధాకర్.

1983లో తనకు పెళ్లి అయిందని.. అప్పట్లో పుకార్లు చాలానే వచ్చాయని.. తమ మధ్య ప్రేమ ఉందని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ.. భయంకరమైన రూమర్లు వచ్చాయన్నారు. అయితే వాటిని పట్టించుకునే వాడిని కాదంటూ క్లారిటీ ఇచ్చారు సుధాకర్. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. కాఫీ ఎక్కువగా తాగుతానని అన్నారు.

తనకు బీర్ అలవాటు ఉందని.. అది కూడా ఓ గ్లాస్ తీసుకునే వాడినని చెప్పాడు. తినే తిండి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని.. కానీ ఆరోగ్యం చెడిపోయిందని.. అలా ఎందుకు జరిగిందో కూడా తెలియదని అన్నారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాననన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సుధాకర్ తెలియజేశారు.



























