Actor Suhas: సుహాస్ తెలుగు సినిమాలలో హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈయన తనలో ఉన్న ప్రతిభను యూట్యూబ్ ద్వారా బయటపెట్టి అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన పలు సినిమాలలో నటిస్తూ నటుడిగా గుర్తింపు పొందారు. అయితే ఈయన నటించిన కలర్ ఫోటో సినిమా ఏకంగా జాతీయస్థాయి అవార్డు అందుకోవడం విశేషం.

తాజాగా సుహాస్ బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కన్నీటి కష్టాలను ఈయన బయటపెట్టారు. తాను డిగ్రీ వరకు చదివానని అయితే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి రావాలని యూట్యూబ్ ద్వారా తనలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.అయితే ఒకానొక సమయంలో ఎలాంటి అవకాశాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని ఈయన తన కన్నీటి కష్టాలను బయటపెట్టారు.
ఈ విధంగా చేతిలో రూపాయి కూడా లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇకపోతే తన అన్నయ్య ఫ్రెండ్ ను డబ్బు సహాయం అడుగుదామన్నా తనకు అడగాలనిపించలేదని తెలిపారు.నా పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన నా చేతిలో 500 నోటు పెట్టి వెళ్లారు. అయితే ఆ డబ్బును చేతిలో పట్టుకొని మూడు గంటల పాటు ఏడుస్తూ కూర్చున్నానని ఈ సందర్భంగా సుహాస్ తన బాధలు బయటపెట్టారు.

Actor Suhas: ఆరోజు జీవితంలో మర్చిపోలేను…
ఇక కలర్ ఫోటో సినిమా ద్వారా తనకు మంచి అవకాశం వచ్చిందని ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపారు. ఈ సినిమాకి జాతీయ స్థాయి అవార్డు అందుకుందని సందీప్ రాజ్ ఫోన్ చేసి చెప్పగానే తాను నమ్మలేదని ఏదైనా ఫ్రాంక్ చేస్తున్నారేమో అనుకున్నానని సుహాస్ తెలిపారు.ఈ సినిమాకి జాతీయ అవార్డు అందుకున్న రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఈయన పేర్కొన్నారు. ఈ సినిమా అందించిన విజయంతో నాకు ఏకంగా వరుసగా ఆరు సినిమా అవకాశాలు వచ్చాయని ప్రస్తుతం ఆ సినిమాలతో బిజీగా ఉన్నానని సుహాస్ పేర్కొన్నారు.

































