ప్రముఖ టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి ఇటీవల కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈమె హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ అలాగే ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పటికీ ఆమె మరణించారన్న వార్తను ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక ఉత్తేజ్ భార్య పద్మావతి చనిపోయిన విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్ హాస్పిటల్ కి వెళ్లి నటుడు ఉత్తేజ్ ను పరామర్శించారు. ఈమె మృతి పట్ల కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కూడా సంతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉత్తేజ్ పద్మావతి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి పేరు చేతన.ఈమె కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

ఇదిలా ఉంటే నటుడు ఉత్తేజ్ కూతురు చేతన త్వరలోనే తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణిగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె బేబీ బంప్ ఫోటో షూట్ చేయించుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె కూతురు పుడితే మా అమ్మ మళ్ళీ పుట్టింది అని సంతోషిస్తానని, కొడుకు పుట్టిన కూడా సంతోషమే అని ఆమె తెలిపింది.

చేతన మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఈమె నటుడు రవి రాజాను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పుడు కొద్ది కాలం పాటు ఉత్తేజ్ తన కూతురితో మాట్లాడలేదు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా టాలెంట్ ఉన్న ఉత్తేజ్ తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.



































