Actor Venu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంవరం హనుమాన్, జంక్షన్ పెళ్ళాం ఊరెళితే, చిరునవ్వుతోనే వంటి సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు హీరో వేణు తొట్టెంపూడి.అనంతరం ఈయన పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. అయితే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ ఆ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటించడం కోసం ఈయన ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు జగపతిబాబుతో తనకు ఉన్నటువంటి మనస్పర్ధలు గురించి తెలిపారు.
జగపతిబాబు తాను చాలా సన్నిహితంగా ఉండే వారిమని తెలిపారు అయితే జగపతిబాబు పూచిగా ఒక వ్యక్తికి 14 లక్షలు అప్పు ఇచ్చాను.అయితే ఆ వ్యక్తి తిరిగి నాకు డబ్బు ఇవ్వలేదు కానీ జగపతిబాబు ఒక్కసారి కూడా ఈ విషయం గురించి తనకు ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. అప్పట్లో 14 లక్షలు అంటే నాకు ఎంతో విలువైనవని ఆయన తెలిపారు.

Actor Venu:ఒక్క ఫోన్ కూడా చేయలేదు..
ఇలా ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆ వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వరని అర్థమైంది అయితే అప్పటికి జగపతిబాబు ఒక ఫోన్ కాల్ కూడా తనకు చేయలేదు దాంతో అప్పటి నుంచి ఇద్దరు మధ్య మాటలు లేవని ఈ సందర్భంగా జగపతిబాబుతో తనకున్నటువంటి మనస్పర్ధలు గురించి వేణు మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.