Actress Amani: నిన్నటి తరం హీరోయిన్లలో సౌందర్య ఆమని రోజా వంటి వారందరూ కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే సౌందర్య కన్నడ నటి అయినప్పటికీ ఈమె అచ్చ తెలుగు అమ్మాయిలా ఎన్నో తెలుగు సినిమాలలో నటించి విశేషమైన తెలుగు ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు.అయితే ఈమె ఎంత తొందరగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో అంతే తొందరగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.

ఇకపోతే నేడు సౌందర్య 50వ జయంతి సందర్భంగా అభిమానులు మరోసారి ఆమెను గుర్తు చేసుకున్నారు. ఇకపోతే సౌందర్య జయంతి సందర్భంగా ఆమని సౌందర్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.సౌందర్య సినిమాలలో ఎలాంటి గ్లామర్ పాత్రలకు తావు లేకుండా ఎంతో సాంప్రదాయమైన అమ్మాయిలా కనిపిస్తూ నటించేది.

సౌందర్యతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేస్తూ దూసుకుపోతున్నప్పటికీ ఈమె మాత్రం తన పరిధి దాటి ఎప్పుడు నటించలేదు.ఈ క్రమంలోనే నటి ఆమని మాట్లాడుతూ తాను నటించిన పలు సినిమాలలో ఎక్స్పోజింగ్ చేశాను కానీ సౌందర్య మాత్రం అలా నటించలేదు.ఎందుకు అలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలలో నటించవని సౌందర్యను అడిగినప్పుడు తాను ఆసక్తికరమైన సమాధానం చెప్పిందని ఈ సందర్భంగా బయటపెట్టారు.
రేపు నా భర్త నా సినిమాలు చూసి ప్రశ్నించకూడదు…
ప్రస్తుతం తాను ఎక్స్పోజింగ్ చేస్తూ సినిమాలు చేస్తే రేపు నాకు పెళ్లి అయిన తర్వాత నా భర్త ఎందుకు అలాంటి పాత్రలలో నటించావు అని ప్రశ్నించడా? రేపు నాకంటూ ఓ ఫ్యామిలీ ఉంటుంది కదా.. అంటూ సౌందర్య సమాధానం చెప్పిందని ఈ సందర్భంగా ఆమని వెల్లడించారు.ప్రస్తుతం డబ్బు కోసం సినిమాలలో చేస్తే రేపు నా భర్త పిల్లలు కలిసి నా సినిమా చూస్తున్నప్పుడు నేను ఏమాత్రం సిగ్గుతో తలదించుకోకూడదు. ప్రస్తుత నా నటన వల్ల రేపు నా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అంటూ సౌందర్య చెప్పారని ఆమని వెల్లడించారు.
































