Actress Anjali: సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ఉన్నటువంటి నటీమణులలో నటి అంజలి కూడా ఒకరు.ఫోటో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె షాపింగ్ మాల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం జర్నీ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా అంజలి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 17 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇలా ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె ఇండస్ట్రీకి సంబంధించిన హీరో జైతో కొద్దిరోజులు రిలేషన్ లో ఉన్నారని అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి.
ఇలా నటుడు జైతో బ్రేకప్ చెప్పుకున్నటువంటి అంజలి ప్రస్తుతం ఒంటరిగా ఉందని అయితే తన కుటుంబ సభ్యులు తనకు సంబంధం చూడటంతో తాను తన కుటుంబ సభ్యులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.
త్వరలోనే అంజలి తన కుటుంబ సభ్యులు చూసిన వరుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం.

Actress Anjali: శరవేగంగా పెళ్లి పనులు..
ఈమె త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు.ఇలా అంజలి పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అసలు అంజలి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు ఏంటి అని అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ తెలియాలంటే అంజలి తన పెళ్లి గురించి స్పందించాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి RC 15 సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటిస్తున్నారు.






























