సోషల్ మీడియాలో సెలబ్రేటీల చిన్ననాటి ఫొటోలు పెడుతూ అభిమానులతో వారి ఆనంద సమయాలను పంచుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకు అందరూ నెట్టింట్లో మునిగితేలుతున్నారు. ఇక ఇన్ స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో సెలబ్రేటీలు తమ అభిమానులతో కలిసి లైవ్ ద్వారా ముచ్చటిస్తున్నారు. తమ వ్యక్తిగత విషయాలను.. చిన్ననాటి విషయాలను ఇలా షేర్ చేసుకుంటున్నారు.

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పలువురు స్టార్స్ త్రోబ్యాక్ ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఓ చిన్నారి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు.. మీరు గుర్తుపట్టండి అంటూ ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూ ఫజిల్ వేసుకుంటున్నారు. అంతే కాకుండా కొన్ని కొన్ని హింట్ లు కూడా ఇస్తున్నారు.
తాజాగా అలాంటిదే మీకు పైన కనపడే ఫొటోను గుర్తుపట్టగలారా.. తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. పెద్ద పెద్ద హీరోలతో కూడా నటించింది.. ఇంకా గుర్తుకు రాలేదా.. అదేనండి మన తెలుగింటి అమ్మాయి హీరోయిన్ అంజలి ఫొటో. టాలీవుడ్ లో ఇప్పటివరకు తెలుగు అమ్మాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా అరుదు. ఇలా తన నటన, అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించింది హీరోయిన్ అంజలి.
ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన కూడా నటించారు. వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. అంతేకాకుండా ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో ఆమె నటించి అందరి మన్ననలు పొందారు.































