Actress Anjali: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క కమర్షియల్ చిత్రంలో తప్పనిసరిగా ఐటమ్ సాంగ్ ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ఉండటం వల్ల ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు ఈ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సమంత శృతిహాసన్ పూజ హెగ్డే తమన్నా వంటి ఎంతోమంది హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేశారు.

ఇదిలా ఉండగా నితిన్ హీరోగా తెరకేక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ తో పాటు ఐటం సాంగులో మాస్ స్టెప్పులతో ఇరగదీసారు నటి అంజలి.అయితే ఈమె ఐటమ్ సాంగ్ లో చేయడం ఇదే మొదటిసారి కాదు ఇదివరకే బోయపాటి శీను అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమాలో కూడా ఈమె ఐటెం సాంగ్ ద్వారా అందరిని సందడి చేశారు.

ఇకపోతే మాచర్ల నియోజకవర్గం సినిమా కోసం అంజలి ఐటమ్ సాంగ్ చేయడం వల్ల తనను ఏకంగా సినిమాలో హీరోయిన్ గా అవకాశం కోల్పోయారని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఓ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేశారు అయితే ఓ సందర్భంలో ఈ సినిమా గురించి అంజలి పరోక్షంగా హింట్ ఇచ్చారు.
ఉద్దేశపూర్వకంగానే అంజలిని తప్పించారా…
ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి హీరోయిన్ గా అంజలిని తప్పించి మలయాళ హీరోయిన్ అనికా సురేంద్రన్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. అయితే అంజలి ఈ సినిమాలో కేవలం ఐటెం సాంగ్ లో నటించగా తనను హీరోయిన్ గా తప్పించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకి చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమా అవకాశం అంజలికి మిస్ కావడంతో అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమా మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతుందని ఈ సినిమాతో అంజలి మంచి హిట్ సినిమా తన ఖాతాలో వేసుకునేదని ఈ సినిమా కోల్పోవడంతో ఈమె గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి మేకర్స్ నుంచి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.






























