Star Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలం పాటు స్టార్స్ గా సక్సెస్ అయినప్పటికీ అనంతరం వారికి అవకాశాలు ఉండవు. ఇలా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి కనుమరుగైన వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో సెలబ్రిటీలు ఫేమస్ అయినప్పుడే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.

ఇక ప్రస్తుతం ప్రతి భాషలో విడుదలయ్యే సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి. ఈ పాన్ ఇండియా క్రేజ్ ను హీరోయిన్లు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక చిన్న పాత్రలో కనిపించాలన్న లేదంటే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించాలన్న కోట్లలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇలా కోట్లలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ నోరా ఫతేహి ఒకరు.
2014 లో టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని 84 రోజులపాటు హౌస్ లో కొనసాగారు. ఈ కార్యక్రమం తర్వాత ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నోరా తెలుగు తమిళ మళయాళం భాషలలో సినిమా అవకాశాలు అందుకున్నారు. అయితే ఈమె స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
నోరా ఫతేహి…
ఇలా ఈమె నటించిన స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇలా ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఐదు నిమిషాల పాటు తెరపై కనిపించడం కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని మేకర్స్ సైతం ఈమె అడిగినది ఇవ్వడానికి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.



























