Actress Gauthami Daughter: నిన్నటి తరం నటి గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన నటనతో ఆకట్టుకునే అందంతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గౌతమి అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ తో సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేశారు.

ఇలా కమల్ హాసన్ తో రిలేషన్ లో ఉన్నటువంటి ఈమె పలు మనస్పర్ధలు కారణంగా తన నుంచి దూరంగా ఉన్నారు. ఇక గౌతమి హీరోయిన్ గా సినిమాలకు దూరమై చాలా కాలం అయింది.అయితే ఈమె తెలుగులో బుల్లితెరపై ప్రసారమవుతున్న కొన్ని కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. ఇకపోతే చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి గౌతమి తన కుమార్తె సుబ్బలక్ష్మిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Actress Gauthami Daughter: గౌతమి వారసురాలుగా ఎంట్రీ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి…
గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొని ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈమెను ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయడం కోసం గౌతమి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈమె ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్ కావడంతో తన కూతురికి అవకాశాలు రావడం పెద్దగా కష్టమేమి కాదు. ఇలా స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఈమె ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.




























