సహజనటి జయసుధ ఎలా మారిపోయారో తెలుసా?

0
75

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజనటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో అద్భుతమైన పాత్రలో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వివిధ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి విశేష ఆదరణ దక్కించుకుంది.

ఇదిలా ఉండగా జయసుధ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడిపారు. ఎన్నో చిత్రాలలో తల్లి పాత్రలో నానమ్మ పాత్రలలో ఒదిగిపోయి నటించారు. ఇలా నాటి తరం నుంచి నేటి వరకు అందరికీ అభిమాన నటిగా మారిపోయిన జయసుధ గత కొంత కాలం నుంచి వెండితెరకు దూరమయ్యారు.

ఈ క్రమంలోనే జయసుధ వెండితెరకు దూరం కావడానికి కారణం ఏమిటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేశారు.అయితే ఈమెకు అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటుందనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే జయసుధ వెండితెరకు దూరం అయినట్లు తెలుస్తోంది.

తాజాగా జయసుధ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు ఈ ఫోటో చూస్తుంటే నిజంగా జయసుధ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసిపోతుంది. ఈ ఫోటోలో జయసుధ పూర్తిగా తన అందాన్ని కోల్పోయి ఎంతో సన్నగా అయ్యారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆమెకు నిజంగానే అనారోగ్యం చేయటంవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here