Actress Karuna: బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించి సందడి చేయడమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమా అవకాశాలను అందుకొని, సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన నటి కరుణ భూషణ్ గురించి అందరికీ సుపరిచితమే. ఇలా వెండి తెరపై బుల్లితెరపై సందడి చేసినటువంటి కరుణ ఎక్స్ ఫోజ్డ్ 24 ద్వారా ఓటీటీలోకి అడుగుపెట్టారు.

ఈ విధంగా కరుణ తెలుగు తమిళ భాషలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి 27 సంవత్సరాలు కావడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా కరోనా మాట్లాడుతూ తన తల్లిది బాంబే అయినప్పటికీ తన పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాదులోనేనని తెలిపారు.
ఇక తనకు ఊహ తెలిసినప్పటి నుంచి నటిస్తూనే ఉన్నానని కరుణ తెలియజేశారు.ఇక తాను హైదరాబాద్ కి చెందిన తెలుగు అబ్బాయిని ప్రేమించి 2007వ సంవత్సరంలో పారిపోయి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారని కరుణా తెలిపారు.ఇక తనకు ఒక బాబు కూడా ఉన్నారని తరువాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగా అబార్షన్ కారణంగా ఆ సమయంలో తాను నటిస్తున్న సీరియల్ నుంచి కూడా తప్పుకున్నానని కరుణ తెలిపారు.

Actress Karuna: నటి కాక పోయి ఉంటే డాక్టర్ అయ్యేదాన్ని….
తనకు ఊహ తెలిసినప్పటి నుంచి నటించడం వల్ల ఇదే ఇండస్ట్రీలోకి వచ్చానని లేకపోతే తను డాక్టర్ అయ్యేదాన్ని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.ఇక తనకు బాగా కావాల్సిన వారిని గుడ్డిగా నమ్మి బాగా నష్టపోయానని అందుకే అప్పటినుంచి ఇతరులను నమ్మడం పూర్తిగా మానేశానని ఈమె తెలిపారు. ఇలా నటి కరుణ తన వ్యక్తిగత విషయాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































