Actress Kasthuri: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటేనే వారి జీవితం ఎంతో సంతోషంగా పూలబాటలో సాగిపోతుందని చాలామంది భావిస్తారు. ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలంటే ఏసీ కార్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఇలా వారి జీవితం ఎంతో అద్భుతంగా కొనసాగుతూ ఉంటుందని చాలా మంది భావిస్తారు.

ఇక కొంతమంది నటీనటులు మాత్రం వారు సంపాదించినది సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి శంకర్.ఈమె తాజాగా చెన్నై మెట్రోలో ప్రయాణిస్తూ తన ఫోన్ పోయిందంటూ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేయడంతో మెట్రో అధికారులు తన ఫోన్ వెతికి తనకు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విధంగా మెట్రోలో ప్రయాణిస్తూ ఫోన్ పోగొట్టుకున్న అనే విషయం తెలియజేయడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈమెను ప్రశ్నిస్తున్నారు. మీరు ఇండస్ట్రీలో సెలబ్రెటీ మీరు మెట్రోలో ప్రయాణించడం ఏంటి అంటూ ప్రశ్నించగా తనకు ఏసీ కార్లు, బంగ్లాలు ఏవి లేవని తాను ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నానని ఈమె తెలిపారు. మరి మీరు సంపాదించినదంతా ఏం చేస్తున్నారు అని మరొకరు ప్రశ్నించారు.

Actress Kasthuri: సాధారణ జీవితాన్ని గడుపుతున్న కస్తూరి శంకర్…
ఈ ప్రశ్నకు కస్తూరి సమాధానం చెబుతూ…. తాను సంపాదించినది మొత్తంమెడికల్ హెల్త్ క్యాన్సర్ పేషంట్ల కోసం ఖర్చు చేస్తున్నానని తెలియజేయడంతో ఎంతోమంది నెటిజన్స్ ఈమె మంచితనానికి ఫిదా అవుతున్నారు. ఇలా ఈమె సంపాదన ఇతరుల కోసం ఖర్చు చేయడం నిజంగా గ్రేట్ అంటూ ఎంతో మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.



































