Actress Keerthi: కీర్తి రెడ్డి పరిచయం అవసరం లేని పేరు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మొదట సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇలా ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకున్నప్పటికీ కెరియర్ పరంగా కీర్తి రెడ్డికి పెద్దగా ప్రయోజనకరంగా మారలేదని చెప్పాలి. అయితే అందరూ కూడా కీర్తి రెడ్డి మొదటి సినిమా తొలిప్రేమ అని భావిస్తారు. నిజానికి ఈమెకి ఇది మొదటి సినిమా కాదు.

కీర్తి రెడ్డి తొలిప్రేమ సినిమా కంటే ముందుగా కమెడియన్ అలీకి హీరోయిన్ గా ఈమె తన మొదటి సినిమాలో నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1996 వ సంవత్సరంలో వచ్చిన ‘గన్ షాట్’ మూవీ కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా.డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డికి కీర్తి రెడ్డి దూరపు బంధువు కావడంతో ఆమెను హీరోయిన్గా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఈ సినిమాలో అలి హీరోగా నటించిన ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో కీర్తి రెడ్డి మొదటగా హీరోయిన్ గా చేశారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ విషయం చాలామందికి తెలియదు.ఇలా ఈ సినిమా ఫ్లాప్ అవడంతో దాదాపు రెండు సంవత్సరాలు పాటు కీర్తి రెడ్డి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

Actress Keerthi: గన్ షాట్ సినిమాలో మొదటగా నటించిన కీర్తి రెడ్డి…
ఇలా రెండేళ్ల పాటు దూరంగా ఉన్నటువంటి ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అలీ పవన్ కళ్యాణ్ కు స్నేహితుడిగా నటించడం విశేషం. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది.



























