Actress Kushboo: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సీనియర్ నటి కుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా కూడా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈమెను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహిళలు ఎదుర్కొన్నటువంటి లైంగిక ఆరోపణల గురించి మాట్లాడుతూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు మహిళలపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇలా మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ దాడుల గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు తాను కూడా లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్నానని ఈమె పడిన ఇబ్బందుల గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.అయితే తనని తన తండ్రి లైంగిక ఆరోపణలకు గురి చేశారంటూ ఈమె షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

Actress Kushboo: 8 ఏళ్ల వయసులోనే వేధించారు..
ఇలా తన తండ్రి తాను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన పట్ల లైంగిక ఆరోపణలు చేశారని వెల్లడించారు. అయితే 15సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తాను తన తండ్రిని ఎదిరించానని ఆ క్షణం తమను వదిలి వెళ్లిపోయాడని ఈమె తెలియజేశారు.ఈ విధంగా స్వయంగా నటి కుష్బూ తన తండ్రి నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాను అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































