Lahari: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో లహరి ఒకరు. ఈమె తెలుగు బుల్లితెరపై వివిధ ఛానల్లలో ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈమె ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో బుల్లితెర సీరియల్స్ కి లహరి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం బాబు పుట్టిన తరువాత కూడా బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఇలా సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకునే లహరి తాజాగా తాను కొత్త కారు కొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈమె తన పేరెంట్స్ , భర్త కొడుకుతో కలిసి కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంజ్ కారు..
ఇక ఈమె ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ కారు ఖరీదు సుమారు 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇలా ఖరీదైన కారును లహరి కొనుగోలు చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.





























