Actress Latha: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పని చేసిన హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు కొంతకాలం తర్వాత ఇండస్ట్రీకి దూరమై తిరిగి తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం సర్వసాధారణం ఇలా కొందరు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో మంచి సక్సెస్ సాధిస్తూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఇప్పటికే ఎంతోమంది సినీ తారలు క్యారెక్టర్ ఆర్టిస్టులు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బిజీగా ఉండగా తాజాగా మరొక నటి సైతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. సీనియర్ నటి లత ఈమె తన సినీ కెరియర్ లో సుమారు పది సీరియల్స్ 150 కి పైగా సినిమాలలో నటించారు. అయితే ఈమె మెయిన్ ఆర్టిస్ట్ కు తక్కువ చిన్న ఆర్టిస్ట్ కు ఎక్కువ అనే విధంగా తన పాత్రలలో నటించేవారు.
ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 150 సినిమాలలోనూ 10 సీరియల్స్ లోను నటించినటువంటి సీనియర్ నటిలత కొన్ని తన వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం తాను తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా కీలకమైన ప్రాధాన్యత కలిగిన పాత్రలలో నటించాలని ఈమె భావించారట.

Actress Latha: అవకాశాల కోసం ఎదురుచూస్తున్న లత..
ఈ విధంగా మంచి పాత్రలలో నటించే అవకాశం వస్తే తను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఈమె ఎదురుచూస్తున్నారు అయితే 150 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన లత పెద్దగా సక్సెస్ కాలేదు కానీ రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవుతారా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది. అయితే మరి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా ఎలా సందడి చేయబోతున్నారో తెలియాల్సి ఉంది.




























