Actress Laya: స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మన తెలుగు అమ్మాయి నటి లయ.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లయ అమెరికాకు చెందిన శ్రీ గణేష్ అనే డాక్టర్ ను పెళ్లి చేసుకొని అమెరికాలోని సెటిల్ అయ్యారు.ఇలా వివాహం తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు కూడా దూరమయ్యారు.

ఇండస్ట్రీలో ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎలాంటి గ్లామర్ షో లేకుండా ఎంతో పద్ధతిగా సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు.ఇక ఈమె అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలను ఏమాత్రం మర్చిపోలేదు.
ఈ క్రమంలోనే మన తెలుగు వాళ్ళు చేసుకునే పండుగలన్నింటిని కూడా లయ ఎంతో సంప్రదాయపద్ధంగా అమెరికాలో జరుపుకుంటున్నారు. తాజాగా దివాళి పండుగకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.ఇక లయ దంపతులకు కుమారుడు, కూతురికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరి ఫోటోలను తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.

Actress Laya: అమ్మాయిలకు మేకప్ పిచ్చని నిరూపించుకున్నారుగా…
ఇకపోతే తాజాగా లయ సోషల్ మీడియా వేదికగా ఒక ఫన్నీ వీడియోని షేర్ చేశారు. తన స్నేహితులతో కలిసి చిన్న దొంగతనం చేశారు. ఒకచోట ఐఫోన్ లిప్ స్టిక్ రెండు ఉండగా లయ మాత్రం ఖరీదైన ఐఫోన్ వదిలేసి లిప్ స్టిక్ దొంగతనం చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతైనా అమ్మాయిలు అమ్మాయిలే. అమ్మాయిలకు మేకప్ పిచ్చి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఒకసారి ఆలీతో సరదాగా కార్యక్రమానికి రావచ్చు కదా మేడం అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.


































