Actress Laya Daughter: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటిగా ఓ వెలుగు వెలిగినటువంటి సీనియర్ నటి లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తన సినీ కెరియర్ లో ఏకంగా రెండు నంది అవార్డులతో పాటు ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా దాదాపు 13 సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన లయ అనంతరం వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈమె అమెరికాలో ఫేమస్ డాక్టర్ అయినటువంటి శ్రీ గణేశన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లయ పలు విషయాలను తెలియచేశారు. పెళ్లి తర్వాత తాను సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అయితే తన భర్త తనని ఎప్పుడు సినిమాలు చేయొద్దు అనే కండిషన్ పెట్టలేదని అయిన తాను గృహనిగా స్థిరపడ్డానని తెలిపారు.
ఇక తనకు ఇద్దరు సంతానం కాగా అమ్మాయి ప్రస్తుతం 9 వ తరగతి చదువుతుందని తెలిపారు. ఇక తనతో పాటు నేను ఎక్కడికైనా బయటకు వెళ్లిన తనని మీ సిస్టరా అంటూ తనని అడుగుతారని లయ తెలిపారు. ఇక తన కుమార్తె కొడుకు తెలుగు బాగా మాట్లాడుతారు. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ మాట్లాడటం వల్ల కాస్త తెలుగు మరచి పోతున్నారని ఈమె తెలిపారు.

Actress Laya Daughter: సినిమాలలో నటిస్తే చూడాలని ఉంది..
ఇకపోతే తన కుమార్తె సినీ ఇండస్ట్రీలోకి రావడం గురించి లయ మాట్లాడుతూ ఇప్పటికే తన కుమార్తె అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారని తెలిపారు. అయితే తనని హీరోయిన్ గా ఓ సినిమాలోనైనా నటిస్తే చూడాలని ఉంది అంటూ ఈ సందర్భంగా లయ తెలియజేశారు.లయ మాటలను బట్టి చూస్తే తప్పనిసరిగా తన కుమార్తె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని అర్థమవుతుంది. మరి లయ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.































