Actress Laya: సినిమా ఇండస్ట్రీలో నటి లయ సినీ కెరియర్ గురించి అందరికీ సుపరిచితమే. ఈమె వరస సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోల సరసన నటించిన లయ దూరంగా ఉన్నారు.ఇలా ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధించిన అన్ని విషయాలను అప్డేట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియా వేదికగా ఎన్నో రీల్స్, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇకపోతే లయ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ముద్దుల కూతురు శ్లోక ఫోటోలను షేర్ చేశారు. డాటర్స్ డే సందర్భంగా ఈమె తన గారాల పట్టి శ్లోక ఫోటోని షేర్ చేస్తూ ఇలాంటి అద్భుతమైన కూతురిని ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఈమె తన కూతురితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.

Actress Laya: లయ పోలికలతో శ్లోక..
ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నేటిజన్స్ లయ కూతురు అచ్చం లయ పోలికలతోనే ఉంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తల్లి కూతుర్ల ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా లయ కుమార్తె ఫోటో చూసేయండి.
































