Actress Mahalakshmi: నటి మహాలక్ష్మి దంపతులు విడాకులకు సిద్ధమయ్యారా… అలా క్లారిటీ ఇచ్చిన నటి!

0
38

Actress Mahalakshmi: తమిళ బుల్లితెర నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహాలక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇదివరకే వివాహం చేసుకొని ఓ అబ్బాయికి జన్మనిచ్చారు. అయితే తన భర్తతో గొడవల కారణంగా తనకు విడాకులు ఇచ్చి ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను రెండవ వివాహం చేసుకున్నారు.
వీరి వివాహం తర్వాత పెద్ద ఎత్తున ఈ జంట గురించి ట్రోల్స్ వచ్చాయి.

మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే ఈయనని పెళ్లి చేసుకున్నారంటూ పెద్ద ఎత్తున ఈ జంట పై విమర్శలు వచ్చాయి. అయితే తమ మధ్య ఉన్నటువంటి ప్రేమను చాటి చెబుతూ ఎప్పటికప్పుడు వీరిద్దరూ చాలా రొమాంటిక్గా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరికొన్ని తమిళ న్యూస్ చానల్స్ అయితే ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారంటూ కథనాలు అల్లుతున్నారు.

ఇలా వీరిద్దరు విడాకులు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటి మహాలక్ష్మి విడాకులు వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ క్రమంలోనే మహాలక్ష్మి తన భర్తతో కలిసి దిగిన ఒక రొమాంటిక్ ఫోటోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ… నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ప్రపంచంలో నేను దేనినైనా సాధించగలను అన్న నమ్మకం ధైర్యం వస్తుంది నా మనసునిండా నువ్వే అమ్ము ఐ లవ్ యు అంటూ క్యాప్షన్ జోడించారు.

Actress Mahalakshmi: దేనినైనా సాధించగలను…


ఈ విధంగా మహాలక్ష్మి చేస్తున్న ఈ పోస్టుకు రవీందర్ చంద్రశేఖర్ అని కూడా స్పందిస్తూలవ్ యు అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం అవాస్తవాలేనని తేలిపోయింది.ప్రస్తుతం మహాలక్ష్మి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.