Actress Malavika: ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ నవీన్ హీరోలుగా నటించిన చిత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కు జోడిగా నటించారు నటి మాళవిక.ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించిన ఈమె నటనతో అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది.

ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మాళవిక అనంతరం దీవించండి’ ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’ ‘నవ్వుతూ బతకలిరా’ ‘చంద్రముఖి’ ‘శుభ కార్యం’ వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే కన్నా ముందుగా తమిళ చిత్ర పరిశ్రమలో నటించారు.
తమిళ ఇండస్ట్రీలో ఈమె 1999లో సుందర్. సి డైరెక్షన్‌లో అజిత్ హీరోగా ‘ఉన్నై తేడి’ మూవీతో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అటు తర్వాత., కన్నడ,హిందీ, మలయాళం భాషల్లో కలుపుకుని 40కి పైగా సినిమాల్లో నటించిన మాళవిక ఓ తెలుగు సీనియర్ హీరో తనని లైంగికంగా ఇబ్బంది పెట్టాడని తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.

Actress Malavika: ఏ మాత్రం చెరగని అందం…
ఇలా క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అప్పటికి ఇప్పటికి మాళవిక అందం ఏమాత్రం చెదిరిపోలేదని అదే అందంతో అందరిని ఆకట్టుకుంటుందని చెప్పాలి. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.































