Actress Meena: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ మీన బాలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఇలా బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె అనంతరం హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన వరుస సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. తన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో విద్యాసాగర్ ఊపిరితిత్తుల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ దంపతులకు 11 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి ఉన్న సంగతి తెలిసిందే.
ఇలా భర్తను కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి మీనా ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి బయటపడుతుంది. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులు తనకు మరో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారని, ఈ క్రమంలోని ఈ విషయం మీనా వద్ద ప్రస్తావించి తనపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలుస్తోంది.తన భవిష్యత్తు కోసం కాకపోయినా తన కుమార్తె భవిష్యత్తు కోసమైన తనకు రెండో పెళ్లి చేయాలనీ కుటుంబ సభ్యులు చెప్పినట్టు సమాచారం.

Actress Meena: కూతురు భవిష్యత్తు కోసం రెండో పెళ్లికి సిద్ధమైన మీనా..
ఇకపోతే కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం తన కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీనా తన స్నేహితుడినే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ వార్తలపై మీనా స్పందించాల్సి ఉంది.































