Actress Meena: తెలుగు తమిళ భాషలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మీనా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇక మీనా దంపతులకు ఒక కుమార్తె జన్మించిన తర్వాత ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ వరస సినిమాలు చేస్తే ఎంతో బిజీగా గడుపుతున్న మీనా జీవితంలో విషాద ఘటన చోటుచేసుకుంది.పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ మీనా భర్త విద్యాసాగర్ మరణించడంతో ఒక్కసారిగా ఈమె కుప్పకూలిపోయారు. అయితే భర్త మరణం తర్వాత ఎంతోమంది స్నేహితులు నటీమణులు తరచూ మీనా ఇంటికి వెళ్లి ఆమెను ఓదార్చు తనకి అండగా నిలిచారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లు తరచు మీనా ఇంటికి వెళ్తూ తనని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు.ఇకపోతే మీనా ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి బయటపడుతూ సాధారణ వ్యక్తిలా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీనా తన స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇకపోతే ఈమె ప్రస్తుతం తన స్నేహితురాలితో కలిసి ఫారెన్ వెకేషన్ లో ఉన్నారు.

Actress Meena: భర్త మరణం నుంచి బయటపడుతున్న మీనా..
మీనా తన స్నేహితురాలు స్టైలిస్ట్ రేణుక ప్రవీణ్ తో కలిసి విదేశాలలో పలు ప్రదేశాలలో తీసుకున్నటువంటి ఒక రీల్ వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈమె ఫారిన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇవి చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మీనా తన భర్త మరణం నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు ఈమెను ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈమె ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ అభిమానులు కామెంట్ లు చేస్తున్నారు.



























