Actress Nadhiya: నదియా పరిచయం అవసరం లేని పేరు కెరియర్ మొదట్లో హీరోయిన్ గా తమిళం, మలయాళ సినిమాలలో నటించి అందరిని మెప్పించిన ఈమె వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

అత్తారింటికి దారేది సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నదియా ఈ సినిమాకు గాను నంది అవార్డు అందుకున్నారు. ఇకపోతే నదియాకు ఇద్దరు కుమార్తెలు.అమెరికాలో కొంతకాలం స్థిరపడిన తర్వాత ప్రస్తుతం వీలు చెన్నైలో స్థిరపడ్డారు చెన్నైలో ఉంటూ నదియా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇలా పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నదియా మాత్రం సోషల్ మీడియాలో చాలా తక్కువగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఈమె తన కుమార్తెలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. నటి నదియాకు ఇద్దరు కుమార్తెలు సనమ్, జానాఅని ఇద్దరు కుమార్తెలు కలరు. ఈ క్రమంలోనే తన కుమార్తెలతో కలిసి ఈమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Actress Nadhiya: సినిమాలలో చేస్తే సక్సెస్ అవుతారు…
ఇక ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు అసలు వీళ్ళు నదియా కూతుర్లు మాదిరిగా లేరు ముగ్గురు అక్కచెల్లెళ్లుగా ఉన్నారని కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం హీరోయిన్లుగా నదియా కూతుర్లు ఏమాత్రం తీసిపోరని సినిమాలలో ట్రై చేస్తే కచ్చితంగా హీరోయిన్లుగా సక్సెస్ అవుతారని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె కూతుర్లతో కలిసి దిగిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



























