Actress Namitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిగా నటించిన నమిత కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు ఇండస్ట్రీలో నటిగా కొనసాగిన ఈమె అనంతరం వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

ఇలా పెళ్లయిన తర్వాత నమిత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇక ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా నమిత తన పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతి అనే విషయాన్ని తెలియజేసి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక తాను గర్భవత అనే విషయం తెలియగానే నిత్యం తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అదేవిధంగా నమిత తన సీమంతం ఫోటోలను బేబీ బంప్ ఫోటోషూట్ కు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా ఈమె గత కొద్ది రోజుల క్రితమే పండంటి మగ కవల బిడ్డలకు జన్మనిచ్చారు. అయితే ఈ విషయాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నమిత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Actress Namitha: మీ ఆశీర్వాదం కావాలి…
జన్మాష్టమి సందర్భంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈమె సోషల్ మీడియా వేదికగా తనకు భగవంతుడు దయ వల్ల ఇద్దరు కవల మగ పిల్లలు జన్మించారని తెలిపారు. ఇలా ఈ విషయాన్ని జన్మాష్టమి సందర్భంగా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అయితే తన బిడ్డలకు మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు.అదేవిధంగా తాను డెలివరీ టైంలో హాస్పిటల్ లో ఉండగా తనకు ఎంతో మంచి సేవలు అందించిన డాక్టర్లకు వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా నమిత కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా నమిత కవల పిల్లలకు జన్మనిచ్చిందనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున ఈమెకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.































