Actress Pallavi Ramisetty: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో నటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పల్లవి రామిశెట్టి గురించి అందరికీ సుపరిచితమే. 2009వ సంవత్సరంలో బుల్లితెర నటిగా తన కెరియర్ ప్రారంభించిన పల్లవి ఇప్పటికి వరుస సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.

తాజాగా ఈమె స్టార్ మా లో ప్రసారమైన పాపేనా జీవనజ్యోతి అనే సీరియల్ లో కూడా నటించారు.ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె త్వరలోనే తల్లి కాబోతోంది. పల్లవి దిలీప్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమె ప్రస్తుతం ఈమె గర్భవతి కావడంతో ఘనంగా సీమంతం వేడుకలను నిర్వహించారు.

Actress Pallavi Ramisetty: శుభాకాంక్షలు తెలుపుతున్న సెలబ్రిటీలు…
ఎంతో సాంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకలను నిర్వహించడంతో ఈ సీమంతానికి సంబంధించిన ఫోటోలను పల్లవి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ ఫోటోలు చూసిన పలువురు సెలబ్రిటీలు నటి పల్లవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈమె గర్భవతి కావడంతో తాను చేస్తున్న సీరియల్స్ నుంచి తప్పకున్నారు. ప్రస్తుతం పల్లవి షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
































