Pavithra Lokesh: గత కొద్ది రోజుల్లో నుంచి సోషల్ మీడియాలోనూ, వార్తల్లోనూ నరేష్ నటి పవిత్ర లోకేష్ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. ఇలా వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారని,త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో ఒక్కసారిగా వీరి వ్యవహారం ఎన్నో వివాదాలకు కారణం అవుతుంది. ఒకవైపు నరేష్ తన భార్య రమ్య పై తీవ్ర ఆరోపణలు చేయగా రమ్య నటి పవిత్ర లోకేష్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.

ఈ విధంగా వీరు ఒకరిపై మరొకరిని దూషించుకుంటూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు.అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్నప్పటికీ, వీరిద్దరు మాత్రం మంచి స్నేహితులమని తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ మా మధ్య ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ వీరి గురించి అనేక కథనాలు వెలువడటంతో నటి పవిత్ర ఏకంగా పోలీస్ మెట్లు ఎక్కారు.

ఈ క్రమంలోనే మైసూర్ లోని వీవీ పురం పోలీస్ స్టేషన్‌లో పవిత్ర పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తనని కొందరి మీడియా ప్రతినిధులు వెంటపడుతున్నారని,తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తూ తనకు ఏమాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అంటూ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదివరకే ఈమె తన పేరుపై ఫేక్ అకౌంట్లు సృష్టించి అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా ప్రస్తుతం మీడియా తనకు ప్రతిష్ట భంగం కలిగిస్తున్నారని
మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మీడియా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు..
ఇకపోతే గత కొన్ని రోజుల క్రితం నరేష్ మూడో భార్య రమ్య పవిత్ర లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యలను కూడా ఈమె తప్పు పట్టారు.కేవలం తను నన్ను బాడ్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారనీ తనకు ఏదైనా ఫ్యామిలీ సమస్యలు ఉంటే తన ఫ్యామిలీ పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలా నన్ను బ్యాడ్ చేయడం భావ్యం కాదు అంటూ తన మాటలను తప్పుపట్టారు. ఏది ఏమైనా ప్రస్తుతం వీరి వ్యవహార శైలి మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడితో ముగుస్తుందో తెలియాల్సి ఉంది.
































