Actress poorna: మహాలక్ష్మి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటి పూర్ణ గురించి అందరికీ.ఈమె తెలుగు తమిళ మలయాళ భాషలలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈమె తెలుగు బుల్లితెర కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.

ఇలా వెండి తెరపై బుల్లితెరపై ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పూర్ణ ఈ ఏడాది జూన్ 12వ తేదీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఈమె ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను జూన్ 12వ తేదీ దుబాయిలో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో తన వివాహం జరుపుకున్నారు.
వివాహం పూర్తి అయిన తర్వాత ఈమె సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తనకు పెళ్లి జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగా మరి కొంతమంది తల్లిగా ప్రమోట్ అయ్యారు. ఈ క్రమంలోనే నూతన సంవత్సరం రాబోతున్న సందర్భంగా పూర్ణ అభిమానులకు శుభవార్తను తెలియజేశారు.

Actress poorna: తల్లిగా ప్రమోట్ కానున్న పూర్ణ…
ఈ సందర్భంగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు తాను త్వరలోనే తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని వెల్లడించారు.ఇలా ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను కూడా జరుపుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు నటి పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.































