Actress Poorna: సినీనటి పూర్ణ గర్భంతో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో డెలివరీ అయ్యారు. ఇలా ఈమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన బిడ్డను ఎత్తుకొని హాస్పిటల్స్ సిబ్బందితో ఈమె దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ విధంగా పూర్ణ మగ బిడ్డకు జన్మనిచ్చారనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం పూర్ణ బేబీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్ణ గత ఏడాది దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా వివాహం చేసుకున్న పూర్ణ పెళ్లయిన కొద్ది నెలలకేస్తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలియజేశారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అందరితో పంచుకున్నారు. అలాగే తన బేబీ బంప్ ఫోటోలను, తన సీమంతపు వేడుకలకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో పంచుకునేవారు.

Actress Poorna:వెల్లు వెత్తుతున్న శుభాకాంక్షలు…
ఇలా తరచు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నటువంటి పూర్ణ తాజాగా తాను డెలివరీ అయిన విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఈమె ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇవి చూసినటువంటి అభిమానులు ఇతర సినీ సెలబ్రిటీలు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


































