Actress Pragathi: నటి ప్రగతి పరిచయం అవసరం లేని పేరు కెరియర్ మొదట్లో హీరోయిన్ గా చేసినప్పటికీ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడి ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించిన ప్రగతి ఈ మధ్యకాలంలో సినిమాలు కాస్త తగ్గించిన సోషల్ మీడియాలో మాత్రం తెగ హంగామా చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఈమె నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే ఈ వయసులో కూడా జిమ్లో భారీ స్థాయిలో వర్కౌట్లు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలు కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇలా తరచూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ సందడి చేసే ప్రగతి తాజాగా మరొక పోస్ట్ చేశారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా జీవితానికి సంబంధించిన పాఠాలను చెబుతూ ఈమె పోస్టులు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా మరొక పోస్ట్ షేర్ చేస్తూ జీవితానికి సంబంధించిన విషయాలను తెలియజేశారు. చేతిలో మందు గ్లాసు పట్టుకుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ… జీవితంలో ఎప్పుడూ కూడా ప్రయత్నాలను ఆపకూడదు…ఆశతో జీవిస్తే అన్ని జరుగుతాయి.

Actress Pragathi: జీవితంలో దేనిని వదులుకోవద్దు…
జీవితంలో దేనిని వదులుకోవద్దు అంటూ ఈమె క్యాప్షన్ జోడించారు. ఇలా చేతిలో మందు గ్లాసు పట్టుకొని జీవితానికి సంబంధించిన పాఠాలను తెలియచేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ పై నేటిజెన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.






























