ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అత్త, తల్లి, చెల్లెలు, వదిన పాత్రలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ చూపే ప్రగతినిత్యం పలు వ్యాయామాలను చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రగతి పలు డాన్స్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇలా సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ప్రగతి తాజాగా మరొక అద్భుతమైన డాన్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
చీరకట్టులో హీరో నవీన్ చంద్ర ఇతర నటీ నటులతో కలిసి సెట్లో ఏకంగా డ్రమ్స్ కొడుతుంటే ప్రగతి తీన్మార్ స్టెప్పులతో అద్భుతమైన డాన్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు పలు రకాలుగా స్పందిస్తూ.. ప్రగతి ఆంటీకి ఎనర్జీ మామూలుగా లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.































