పాపం.. ప్రగతి ఆంటీ ఆ కోరికను ఇలా తీర్చుకుంటోంది..!!

0
180

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పద్దతి గల తల్లి పాత్రలకీ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ప్రగతి.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది.. ఏకంగా తనకు సంబంధించిన బోల్డ్ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది..నెట్టింట్లో అవి బాగా వైరల్ కూడా అవుతున్నాయి.’ఏమైంది ఈవేళ’ సినిమాలో హీరో తల్లిగా అద్భుతంగా నటించి ఆ పాత్రకు గానూ ఏకంగా నంది అవార్డు కూడా సాధించింది.

అంత మంచి నటి, వయసు పెరిగే కొద్దీ పద్దతిగా ఉండాల్సింది పోయి, స్లీవ్ లెస్ లో కనిపిస్తూ.. టైట్ డ్రెస్ లు వేసుకుంటూ ఫోటోలు వీడియోలు దిగి.. పైగా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేయడం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. అసలు ప్రగతి ఆంటీ ఎందుకు ఇలా చేస్తోందో తెలియదు గానీ, అవకాశం వస్తే.. హీరోయిన్ గా కూడా చేయడానికి తానూ రెడీ అన్న మాదిరిగా ఉంది ఆమె వ్యవహారం. తెలుగు హీరోలకు వదిన..అక్క.. తల్లిగా నటించి మెప్పించిన ఈ ఆంటీ మరి హీరోయిన్ గా కూడా నటిస్తోందేమో.

ఏది ఏమైనా ఎలాంటి పాత్రలో నటించినా ప్రగతి అద్భుతంగా అభినయించగలదు. అక్కడక్కడా ఓవర్ యాక్టింగ్ చేస్తోన్నట్టు అనిపించినా మొత్తంగా చూస్తే.. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ… ప్రేక్షకులను మెప్పించడం ఆమె ప్రత్యేకత. ఇప్పుడున్న బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి టాప్ ప్లేస్ లో ఉంటుంది. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పుకొస్తున్నారు.ఆమెకు హీరోయిన్ గా నటించాలనే ఆశ చిన్నప్పటి నుండి ఉందట.

పైగా ప్రగతి తన కెరీర్ ఆరంభంలో పలు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి ఆకట్టుకుంది. కానీ తన వివాహం తర్వాత ఆమె నటనకు దాదాపు మూడేళ్ళ పాటు గ్యాప్ ఇచ్చింది. అనంతరం కొన్ని సీరియల్స్ లో నటించినా కుటుంబ బాధ్యతలు కారణంగా ప్రగతి హీరోయిన్ గా కంటిన్యూ చేయలేకపోయింది.ఇక ఆంటీ ఏజ్ వచ్చాక తల్లి పాత్రలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. కానీ తనలోని హీరోయిన్ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here