Actress Prema: కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం ధర్మచక్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి ప్రేమ.ఇలా వెంకటేష్ ప్రేమ జంటగా వచ్చినటువంటి ధర్మచక్రం అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో అనంతరం ఈమె వరస సినిమాలలో నటించి తెలుగులో కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా తెలుగు తమిళ కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ప్రేమ దాదాపు 14 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఇలా చాలా కాలం తర్వాత ఈమె అనుకోని ప్రయాణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అక్టోబర్ 28వ తేదీ విడుదలై థియేటర్లో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రేమ ఉపేంద్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ… ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఓం సినిమాలో నటించానని తెలిపారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉపేంద్ర తనని ఎంతగానో బాధ పెట్టారని అసలు తనకు మానవత్వం కూడా లేదంటూ ఈమె
చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Prema: మహిళలంటే నాకు గౌరవం..
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉపేంద్ర కలర్స్ తీసుకొని తనపై చల్లారని అయితే ఆ కలర్స్ కళ్ళల్లో పడి కొంత సమయం పాటు తాను నరకం అనుభవించాను అతనికి ఏమాత్రం మానవత్వం లేదని ఈమె కామెంట్ చేశారు. అయితే ఈ విషయంపై ఉపేంద్ర అభిమానులు నటి ప్రేమ పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఇక ఈ విషయంపై ఉపేంద్ర స్పందిస్తూ తాను సినిమా ఫర్ఫెక్ట్ గా రావడం కోసం అలా చేసి ఉంటా తప్ప తనకు ఆడవాళ్లు అంటే చాలా గౌరవమని ఈయన తెలిపారు. అయినా అప్పటి సంఘటనను ఇప్పటికీ ఆమె గుర్తుపెట్టుకుని నన్ను ద్వేషిస్తుందనుకోలేదు అంటూ ఈయన వెల్లడించారు.































