రకుల్ ప్రీతి సింగ్ మొదట కన్నడంలో గిల్లి అనే చిత్రంలో నటించి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తర్వాత తెలుగులో ఆమెకు మొదటి సినిమా ‘కేరటం’.. తర్వాత వెంటాద్రి ఎక్స్ ప్రెస్. ఇలా ఆమె తెలుగులో కూడా తనకంటూ పేరు సంపాదించుకొని స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఆమె గురించి చెప్పుకునేది ఏంటంటే.. తమ అందం కోసం కృత్రిమ మెరుగులు దిద్దుకుంటోందట. తాజాగా ఒక ఫోటో వైరల్ అయింది. ఈ ఫొటోలో ఆమె పెదవులు మునుపటి కన్నా వేరే విధంగా ఉన్నాయి. ఆకృతి మారింది. ముఖకవళికలు పూర్తిగా మారిపోవడంతో ఆమె సర్జరీ చేయించుకుందని మాట్లాడుకుంటున్నారు.

రకుల్ ప్రీత్‌సింగ్ తన లుక్ లో మరింత మెరుగుపరుచుకునేందుకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందన్న వార్తలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. లుక్ మార్చుకునేందుకు సినీనటులు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడం కొత్తేమి కాకపోవడంతో రకుల్ కూడా ఆ జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంటుది. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ల కోసం ఎక్కువగా దర్శక, నిర్మాతలు చూస్తూ ఉంటారు. అందుకోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందా అన్న సందేహం కలుగుతోంది. మరి ఈ వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం రకుల్ తెలుగులో వైష్ణవ్ తేజ్ తో కలిసి కొండపొలం చేస్తోంది. మరోవైపు హిందీలో డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, మేడే చిత్రాల్లో నటిస్తోంది. కొండపొలం సినిమా వచ్చే నెల 8న విడుదల కానున్న విషయం తెలిసిందే.

































