Rakul Preeth Singh: రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు..

బాలీవుడ్ నటుడు నిర్మాత అయినటువంటి జాకీ భగ్నాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి ఈమె పెళ్లి తర్వాత కెరియర్ పై ఫోకస్ పెట్టడమే కాకుండ వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినటువంటి ఈమె జిమ్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఎంతోమంది సెలబ్రిటీలు ఈమె జిమ్ కి వెళ్తూ ఉంటారు. ఇలా పలు వ్యాపారాలలో బిజీగా ఉంటూ వ్యాపారవేత్తగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె త్వరలోనే హైదరాబాద్లో మరో వ్యాపారం ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల ఈమె హెల్త్ అండ్ టేస్టీ అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
రెస్టారెంట్ బిజినెస్..
ఈ వీడియో చూసి బహుశా ఈమె రెస్టారెంట్ బిజినెస్ పెట్టబోతున్నారా అని అందరూ ఆ సందేహాలు వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈ బిజినెస్ రెస్టారెంట్ బిజినెస్ అని తెలుస్తుంది .హైదరాబాద్ ఆరంభం అనే పేరిట ఈ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారని ఈ రెస్టారెంట్లో కేవలం మిల్లెట్ తో తయారు చేసిన ఫుడ్ మాత్రమే లభించబోతుందని తెలుస్తుంది.



























