మా ఎన్నికల పై నటి రోజా షాకింగ్ కామెంట్స్…నా మద్దతు వారికే..!

0
1054

చిత్ర పరిశ్రమలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలలో పోటీ నెలకొంది.ఈ ఎన్నికలలో పెద్ద ఎత్తున లోకల్ నాన్ లోకల్ అనే వివాదం చెలరేగుతోంది.తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వాళ్ళకే పట్టం కట్టాలని పలువురు భావించగా మరికొందరు.. ఈ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉండగా మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి మెగా కుటుంబం మద్దతు తెలుపగా మంచు కుటుంబానికి పలువురు సీనియర్ నటీనటులు మద్దతు తెలుపుతున్నారు.

ఇప్పటికే పలువురు నటీనటులు మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికే మా పట్టం కట్టాలని తెలుగు వాడి గౌరవాన్ని నిలబెట్టాలి అంటూ మంచూ ప్యానల్ కు మద్దతు తెలిపారు. ఇలా మా ఎన్నికలు రోజురోజుకు ఉత్కంఠత నెలకొల్పుతున్న సమయంలో మా ఎన్నికలపై నటి ఎమ్మెల్యే రోజా స్పందించారు.

ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మా ఎన్నికల గురించి రోజా మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసినటువంటి వారి మేనిఫెస్టోను చూశాను. తాను లోకల్ నాన్ లోకల్ అనే తేడా చూడకుండా ఎవరి మేనిఫెస్టోలో అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే వారికే తన ఓటు అంటూ ఈ ఎన్నికల పై షాకింగ్ కామెంట్స్ చేశారు.