Actress Sadaa: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సదా గురించి అందరికీ సుపరిచితమే. ఈమె ప్రస్తుతం వెండితెరకు దూరమైనప్పటికీ బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా బుల్లితెర రియాలిటీ షోలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సదా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈమె షేర్ చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చాలామంది తమ మనసుకు నచ్చిన వారిని ఎక్కడ కోల్పోతామని భయపడుతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ మనసుకు నచ్చిన వారే మోసం చేస్తూ ఉంటారు.
ఇలాంటి వారితో ఉన్నామంటే మనల్ని మనం ప్రమాదంలో పడేసుకున్నట్టేనని తెలిపారు. ఒకరి కోసం మీరు ఎన్ని త్యాగాలు చేసిన మీకు సరైన గుర్తింపు రాకపోతే మనం చేసిన త్యాగాలకు అర్థం లేదు. ఎందుకంటే మనతో పాటు చివరి వరకు ఉండేది అంతరాత్మ మాత్రమే. మన జీవితంలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ చివరి వరకు నీకు నువ్వు మాత్రమే తోడుంటావు.

Actress Sadaa: చివరికి నీకు నువ్వే తోడు…
మన ఇంట్లో అవసరం లేనటువంటి వస్తువులను ఎలాగైతే పడేస్తుంటామో మన జీవితంలో అవసరం లేని బంధుత్వాలను దూరం పెట్టడం మంచిది.ఇలాంటి బలవంతపు బంధుత్వాలలో చిక్కుకోవడం కన్నా ఒంటరితనమే మంచిది అంటూ సదా చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.































