టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత అక్కినేని సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అయితే 15 మిలియన్ల ఫాలోవర్స్ ను అందుకుంది. ఒక విధంగా సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ గా కూడా సమంత రికార్డ్ సృష్టించిందని చెప్పవచ్చు.

అయితే ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో నటించి అక్కడ పారితోషికం ఆధారంగానే సంపాదించడం కాకుండా.. వివిధ రకాలుగా ఆమె సంపాదిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు. ఓ బేబీ సినిమాతో ఆమె రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పెరిగింది. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో సమంతకు సంబంధించిన షూటింగ్ అంతా అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సమంత మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉన్నట్లు సీని వర్గాల టాక్. ఫ్యామిలీ మ్యాన్ గా బాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అక్కడ కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సమంత ఇన్ స్టాలో చేసే ప్రతీ పోస్టుకు దాదాపు రూ.7 నుంచి 13 లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తోంది.
ఈ విధంగా ఆమె తన డైలీ మెయింటైన్స్ కోసం సోషల్ మీడియాను సైడ్ ఇన్ కమ్ గా చేసుకున్నట్లు సమాచారం. ఇక విడాకుల విషయంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు. అందులో నిజం లేదని.. మీడియాను కుక్కలతో పోల్చిన ఫోటోను కూడా షేర్ చేసుకుంది.
































