Actress Sameera: బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన సమీరా షరీఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటి సన కొడుకు అన్వర్ ని వివాహం చేసుకున్న సమీరా వివాహం తర్వాత నటనకు దూరంగా ఉంటుంది. అయితే ఇలా సీరియల్స్ లో నటించకపోయినా కూడా బుల్లితెర మీద ప్రసారం అవుతున్న అనేక టీవీ షోలలో హాజరవుతూ సందడి చేస్తోంది.

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సమీరా తన ఫోటోలు వీడియోలతో పాటు తన కొడుకుకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.
తాజాగా సమీరా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సాధారణంగా పబ్లిక్ ప్రదేశాలలో బిడ్డకు పాలు ఇవ్వటానికి స్త్రీలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సమీరా మాత్రం అలా ఇబ్బంది పడకుండా తన బిడ్డ ఆకలి తీర్చడమే ప్రాధాన్యంగా భావించి విమానంలో తన బిడ్డకు పాలు ఇచ్చింది.
ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఇంస్టాగ్రామ్ లో సమీరా ఈ వీడియో షేర్ చేస్తూ..”నా బిడ్డ ఆకలి తీర్చటానికి సమయం ,సందర్భంగా చూసాను. పైగా నేను వేసుకున్న డ్రస్ చాలా సౌకర్యంగా ఉంది. దీని వల్ల నా కొడుక్కి పాలు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు.. నా బాబుకి ఆకలి అయినప్పుడల్లా పాలిచ్చి వాడి ఆకలి తీరుస్తా’’ అని అంటూ బిడ్డకు పాలివ్వటంలో ఉన్న మాధుర్యం గురించి గొప్పగా చెప్పింది.

Actress Sameera: విమానంలో బిడ్డకు పాలిచ్చిన సమీరా…
ఈ వీడియోలో సమీరా విమానంలో తన బిడ్డకు పాలిస్తూ.. జో కొడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వీడియో మహిళలను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్థుత కాలంలో చాలమంది తమ పిల్లలకు పాలు ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. కానీ సమీరా ‘అసలైన అమ్మతనాని అద్దం పట్టేలా అందంగా చెప్పారు.. మీ బిడ్డ అదృష్టవంతుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram































