Tollywood: బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగి ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో అందాల తార సనా ఖాన్ ఒకరు. ఈమె 18 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించారు.

ఇక సనా ఖాన్ తెలుగులో మిస్టర్ నూకయ్య, కళ్యాణ్ రామ్ కత్తి, నాగార్జున గగనం వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికి ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈమె వివాహం చేసుకొని దుబాయిలో సెటిల్ అయ్యారు. దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు, వ్యాపార వేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ ను సనాఖాన్ వివాహం చేసుకుంది.
ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లిగా తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు ఇదిలా ఉండగా సనా ఖాన్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో డేటింగ్ చేసింది. అయితే ఆయనతో డేటింగ్ చేసిన కొద్ది రోజులకే తన నిజ స్వరూపం బయటపడటంతో ఏడాదిలోపే తనకు బ్రేకప్ చెప్పేసారు.
తనతో బ్రేకప్ చెప్పుకున్న అనంతరం సనా ఖాన్ మెల్విన్ గురించి సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆయనకు చాలామంది అమ్మాయిలతో అఫైర్ ఉందని వారి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకునే వారని ఎంతోమంది అమ్మాయిలను మెల్విన్ మోసం చేశారని తెలిపారు. ఇక నన్ను కూడా చాలా సందర్భాలలో కొట్టడమే కాకుండా అసభ్యకర పదాలతో దూషించేవాడని తెలిపారు..
ఇక మెల్విన్ మైనర్ అమ్మాయికి కూడా డ్రగ్స్ ఇచ్చి గర్భవతిని చేశాడు అంటూ ఈమె షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాతనే ఆయనతో నేను బ్రేకప్ చెప్పుకున్నాను అంటూ కొరియోగ్రాఫర్ మెల్విన్ గురించి నటి సనా ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.






























