Actor Danush: భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్య పాత్రలో నటించిన సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ సినిమాలో రానా భార్య పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఈమెకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.

ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు. అదేవిధంగా సార్ సినిమాలో కూడా ఈమె నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ధనుష్ సంయుక్తనీ గోకినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా ధనుష్ టార్చర్ భరించలేక వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఇకపోతే కళ్యాణ్ రామ్ సరసన నటించిన బింబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న ఈమెకు ధనుష్ తో గొడవల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ విధంగా ధనుష్ గురించి తన గురించి బయట ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయని తెలియగానే ఒక్కసారిగా ఆమె షాక్ అయ్యారు.
చాలా క్రియేటివిటీ ఉండాలి….
ఈ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన సంయుక్త.. వాట్..మా ఇద్దరి పై అలాంటి న్యూస్ లు వచ్చాయా..నాకు ఇప్పటి వరకు తెలియదు. అలాంటి వార్తలు రాయాలంటే చాలా క్రియేటివిటీ ఉండాలి అంటూ ఈ సందర్భంగా తనకు ధనుష్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని ఈమె క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం సంయుక్త చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అలాగే తన గురించి ధనుష్ గురించి వస్తున్న వార్తలకు ఈమె ఇలా చెక్ పెట్టారు.


































