Actress Sneha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన పాత్రలలో అద్భుతమైన సినిమాలలో నటించి విపరీతమైన ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు నటి స్నేహ.ఈమె ప్రియమైన నీకు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో సంప్రదాయబద్ధంగా చూడముచ్చటగా ఉన్న స్నేహ మరొక సౌందర్యను తలపించారు.

ఈమె కూడా గ్లామర్ పాత్రలకు తావు లేకుండా ఎంతో అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈమె కూడా సౌందర్య లాగే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుందని అందరూ భావించినప్పటికీ ఈమె తక్కువ సమయంలోనే ఫెడౌట్ అయ్యారు. అయితే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో వదిన అక్క పాత్రలలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈమె 2011వ సంవత్సరంలో తమిళ నటుడు ప్రసన్న అనే నటుడిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక వీరిద్దరూ కలిసి పలు యాడ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా స్నేహ తండ్రి సుహాసిని రాజారాం నాయుడు 77వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే స్నేహ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వేడుకలలో ఎంతో సంతోషంగా పాల్గొన్నారు.

Actress Sneha: ఘనంగా భీమ రథ శాంతి
ఈ విధంగా తన తండ్రికి 70వ పుట్టినరోజు వేడుకలను జరుపగా ఈ వేడుకలను భీమ రథ శాంతి అని పిలుస్తారు. ఇక ఈ వేడుకల కోసం స్నేహ కుటుంబ సభ్యులందరూ ఎంతో ట్రెడిషనల్ లుక్ లోసందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram






























